Saturday, December 23, 2017

‘చ’మత్కృతి”-రాఖీ

చర్విత చరణమే.. చదువగ..ప్రతివచనమే/
చకితులజేయగా..చదువులమ్మకైనతరమే/
చంద్రికలు ..చక్కెరగుళికలు చతురోక్తులు. ...
చెలిమిసేయు రచనలు  చదువరులవరాలు../
చెమరించిన చక్షువులే....చక్కనికవితకు చప్పట్లదుప్పట్లు..!!

చక్కని చిక్కని..చక్కరవింటిదేవర/
చంద్రికకై..చకోరితపననెరిగిన చందంబున..
చంగల్వశరమురువ్వ/
చెలి చెక్కిలినే...చేతాకగ/
చక్కిలిగిలిగల్గ...
చెక్కు చెదరని..చిత్తము. ..చంచలమాయె  ... /
చెత్త చేతనమాయే !!


No comments:

Post a Comment