"మొలక"
ఆకాశమూ
తుపాకి ఎక్కుపెడుతుంది
శవం
కొత్తగా వాసన వేసినప్పుడల్లా
మేఘం
పురిటి నొప్పులు పడుతుంది,
వడిసెల గుడిసె నొదిలి
పట్నం పొలిమేర తొక్కుతుంది.
కొత్త కవిత్వం
నాలుక తో
తీక్షణంగా చూడగలుగుతుంది.
కనులు వాసన చూడడం,
చెవులు మాట్లాడడమూ
అలవర్చుకుంటాయి.
విషయం ఎంత సంక్లిష్టమైతే
కాలం
అంత అక్కున చేర్చుకుంటుంది,
అగమ్యగోచరం
ఎప్పుడూ
ఆనంద దాయకమే!!
No comments:
Post a Comment