"జిందగీ-చల్నేదో బాల్కిషన్"
మరణాన్ని
అనుభవిస్తూనే ఉన్నాం
అనుక్షణం..
ఏదైతేనేం కారణం...!
అవతల ఫిరంగులేంలేవు...
మన బలహీనత
అవతలి వాడికి అణ్వస్త్రం.,!
అవినీతిపై
శంఖారావం సంగతి సరే.,
అరె జాందేవ్ భై
ఈసారికిలా
కానిచ్చేద్దాం ,
ఎందుకొచ్చిన కిరికిరి!!
అరె చెలో భై
ట్రాఫిక్కోడెవడూ లేడు,
ఎర్రలైటు నార్పేద్దాం.,!!
ఈళ్ళకి పనేం లేనట్టుంది
గిదేందిబై
జనమంతా రోడెక్కేసిన్రు
జర జర్గరాదే
అరజెంట్ పనుంది బై
లైన్ పట్టాలని
మాకూ తెల్సు లేవో
గీ రూల్సుగీల్సనుకుంటే
ఈణ్ణే తెల్లారుద్ది
ఎటు జాగదొర్కితే
అటే బండి ని పోనీయన్నా
అరె గీడేందిర బై
ఇండికేటరెయ్యకుండ
ఎట్లొ స్తుండో సూడన్న
ఇంట్లగాని శెప్పచ్చినవా
తమ్మీ,జర శూశి నడ్పరాదె
అరె పాగల్ గున్నవ బై
గీ పాతబస్తీల
రూల్సుగీల్సు జాంతేనై
హౌ మల్ల గదంతే
అరె జాందేవ్ బై
సిటీ అన్నంక
సొట్టల్వడుతూనే ఉంటయ్
లైట్ దీస్కో అన్నా
అరె మస్తు సోచాయించకు
దమాక్ ఖరాబైద్ది
చల్నే దో బాల్కిషన్
నిత్యం సచ్చుడు
నిత్యంబుట్టుడు
యహీహై రే జిందగీ
మరణాన్ని అనుభవిస్తూనే
ఉన్నాం
అనుక్షణం
లోపలా బయటా
కారణం
ఏదైతేనేం...!!
No comments:
Post a Comment