Saturday, December 23, 2017


"చావో రేవో"

వట్టిపోయిన గోవులు
ఫించన్ సైతం నోచని
గ్రామీణ బ్యాంకు 
(రిటైర్డ్)ఉద్యోగ జీవులు!!

అవసరం ఉరిమితే
మరణం తరిమితే

కక్కలేక మ్రింగలేక 
బ్రతుకే బరువైతే

చావో రేవో
తాడో పేడో

పెడితే ప్రాణాల్ని ఫణం
సాకారమైంది తెలంగాణం

బ్యాంకులు మూసేసి
పార్లమెంటు ముందు గుడారమేసి

ఆమరణదీక్షకు తెరతీస్తే
చట్టము న్యాయము శాసనముల
హృదయాలు కరుగదీస్తే

సాధిస్తే పింఛనే!
తలతెంచితే
విధి వంచనే!!

అనివార్యం ఉద్యోగ విరమణం
మనుగడకై చేయక తప్పదు రణం!!

No comments:

Post a Comment