Saturday, December 23, 2017

"భ్రమ'ర నాదం..!!"  రాఖీ

ఫేస్ బుక్ ఓ ఫేక్ బుక్...
క్లిక్ అయ్యామా అది మగవాడి లక్..!

ఇక్కడంతా చిత్రాలే
చిత్రాల పట్ల ఆత్రాలే
నారి నారి సారించిందా
బేషరతు లొంగి పోవడాలే
కలికి పేరు కనిపించిందా
సొల్లుకార్చుకోవడాలే

అద్భుతంగా రాసే అతివలున్నారు
కాదనలేని సత్యం
భజంత్రీలకు భ్రమిసే భామలున్నారు
ఒప్పుకోవలసిన నిజం

ఒక శుభోదయ పలకరింపుకు
లక్షల ఇష్టాల జడిలో తలమునకలు,
ఒక శుభరాత్రి వీడ్కోలుకు
వేల వ్యాఖ్యలతో వెంపర్లాటలు

చంకనెక్కించుకొవడానికి
చనువిచ్చే చంచలాక్షులూ..
సందుదొరికితే అందలమెక్కించే
గ్రంథసాంగులూ...

ఎవరిది మాయో...
ఎవరిది మర్మమో
నర్మగర్భాల నాటకాల్లో
నటులు ,ప్రేక్షకులూ
చతురులే..
కాలక్షేప వ్యాపకాల్లో
ఇరు పక్షాల్లోనూ
ఐంద్రజాలికులే...

ఒక లిట్మస్ టెస్ట్...
మగువ మగలా ప్రయత్నిస్తే..
ఆత్మ పరిశీలన బెస్ట్
ఒక వేగులా ఆరాతీస్తే...

ఇది అసూయనో..అక్కసో అనుకోక
ఇది జలసో..కసో..అని భావించక..

వింత పోకడలకు 
స్వస్తి వాక్యం అవుతుందేమో..
వంత పాటలకు
చరమగీతం ఆలపిస్తుందేమో..

ఆలోచించండి భవిత చిక్కువిడుతుంది!
ఆచరించండి కవిత చిక్కబడుతుంది...!!

No comments:

Post a Comment