“ఏంటి ఈ శబ్ధం?”-రాఖీ
ఎగరడానికి..సమాయత్త మౌతున్నాయి
రెక్కలు విదిలిస్తూ అక్షరపక్షులు..
ఎద పంజరాలను ఛేదించుకుంటూ...
ఉర:పంజరాలను అధిగమించుకొంటూ...
ఆలోచన గగనాలకి -భావమేఘమాలకి..
మనసు మ్రాను పై వ్రాలి
గుండె (అల)జడిలో తడిసి
గొంతు గూటిలో మాటల జత కట్టి
పెదాల పదాల రూపుదాల్చి
వ్రేళ్ల దారుల్లో ప్రయాణించి
కాగితరోదసిలో.. విహరించేందుకు..
వ్రేళ్ల దారుల్లో ప్రయాణించి
కాగితరోదసిలో.. విహరించేందుకు..
స్వేచ్చగా సంచరించేందుకు..
నవరసాల..వర్ణాలు...
పంచేంద్రియ అర్ణాలు..
అక్షరాలు ....
అక్షరాలు ....
బహురూపులు సంతరించుకొంటున్నాయి..
సీతాకోక చిలుకలా అలకరించుకొంటున్నాయి..
కోకిలలై పాటలా..కలహంస లై పద్యం లా
పాలపిట్టలై కధలా , చిలుకలై పలుకుల్లా
పాలపిట్టలై కధలా , చిలుకలై పలుకుల్లా
నీటి బిందువులన్నీ రాశిగా ఏకమై
జలపాతంలా ఉరికి నట్టు
ఊటలా ఉబికినట్టు
అచ్చరాలు... అక్షరాలై
అచ్చరాలు... అక్షరాలై
ప్రేమనీ..విరహాన్నీ..
మోదాన్నీ.. ఖేదాన్నీ..
వాస్తవాన్నీ ,విప్లవాన్నీ
లాలినీ..జాగృతినీ అర్చననీ ... ప్రార్థననీ..
పల్లవిస్తున్నాయి..ప్రజ్వలిస్తు న్నాయి...
పల్లవిస్తున్నాయి..ప్రజ్వలిస్తు
అక్షరాలు... కవి పావురాలు...
వ్యర్థ వాగ్దానాలుగా..బలియౌతూ.. ప్రగాల్భాలుగా ..చెలామణి అవుతూ
ఊక దంపుడుగా ఉరివేయ బడుతూ..
విరిగిన రెక్కలతో..నేలకొరుగుతూ..
రాలిన ఈకలతో.. చేష్ట లుడుగుతూ..
దేవదత్తుల..కేళిలో..
సిద్దార్థుల..మాలిమిలో...
అక్షరాలు కావు క్షరాలు..!
సాహితీ పిపాసుల’కవి’వరాలు!
No comments:
Post a Comment