Saturday, December 23, 2017

"దేశభక్తి"

ప్రశంస 
కష్టాన్ని మరిపిస్తుంది,
సద్విమర్శ 
ఉన్నత శిఖరాధిరోహణకు
మార్గ దర్శకమౌతుంది.

శల్య సారథ్యం కాదు, 
కావల్సింది 
కృష్ణ సారథ్యం!

శకుని మంత్రాంగం కాదు,
పాటించాల్సింది
వికర్ణుడి ధర్మనిరతి.,!!

దేహాన్ని,దేశాన్ని
ప్రేమించని వాడు
దేన్నీ ప్రేమించలేడు

కన్నతల్లికి పుట్టిన ఊరుకు
ఏదైనా చేయలేని నాడు
మనుషుల్లో జతకాడు!!!

జయహో భారత మాత
జయహో విశ్వవిధాత🇮🇳

No comments:

Post a Comment