Saturday, December 23, 2017

మాటే 'మంత్రము'( బ్రతికించేది,చంపేసేదీ)

మాట..భావచిత్రం..
మాట బతుకు ఛత్రం
మాట మంత్రసాని
మాట మార్గదర్శి
మాట వేదమంత్రం
మాట స్నేహ తంత్రం

మాట మదికి మదికి వంతెన
మాట నేలకు నింగికి నిచ్చెన
మాట దివ్యౌషధం
మాట హృదయ మేధం

మాట ఇరువైపులా పదునున్న ఖఢ్గం
మాట మచ్చికైందనిపించే వ్యాఘ్రం

మాట నాగులనైనా ఆడించే నాదస్వరం
మాట వాడ గలిగిన వారి పాలిటి అపురూప వరం !!

మాట కవితకు కన్నతల్లి
మాట కవి పాలిటి కల్పవల్లి!!!

No comments:

Post a Comment