"భజన"
మీరు కాదా
నేను కాదా దేశభక్తులం,
నిస్సందేహంగా,
నిర్ద్వందంగా,
అక్రమాలు ,అరాచకాలు
ఎక్కడున్నా దునుమాడాల్సిందే,
నిఖార్సుగా..
గుడ్డిగా
దేనికి భజన చేసినా
తప్పే,
కుడి ఐనా ఎడమైనా,
భజరంగ్ దళ్ ఐనా,
పాక్ ప్రేరేపిత
ముష్కర మూకలైనా,
ఖండించాల్సిందే
దండించాల్సిదే,
మంచి... మానవత,
ప్రగతి శీలన
ఎక్కడ ఉన్నా
సంగ్రహించాల్సిందే...!
మీకు నాకు
ఇక్కడే భావవైరుధ్యం.,
మిగితా అంతా సేమ్ టు సేమ్..
మీరు ఒక భావజాలానికే ,
ఒక సిద్ధాంతానికే
చెందిన వ్యక్తుల
సమూహానికి బద్ధులు,
నేను అలా కాక
నా మనసుకు మాత్రమే
నిబద్ధుడను...!!
No comments:
Post a Comment