"మనోధర్మం"
ఓ కవీ రవీ పవీ!
కవిత్వం ఎందుకోసమో
ఎవరికోసమో రాయం,
కవిత్వం గుండె బరువు దింపుకోవడం,
కవిత్వం అనుభూతిని అక్షరీకరించడం,
కవిత్వం మనని మనం
మననం చేసుకోవడం
కవిత్వం మౌనంగా రోదించడం
కవిత్వం మనకు మనం వాదించడం
కవిత్వం వల్ల కల్ల
ఉధ్ధరించడం,ఉధ్ధరించబడ్డం
కవిత్వం సమాన తాత్వికతగల వారితో
సమాలోచనం
రాయడం కవి ధర్మం
నచ్చితే పాఠక స్పందనం
నచ్చకుంటే సాష్టాంగ వందనం!!
No comments:
Post a Comment