Saturday, December 23, 2017

నాలుక కొసదూల

ఓ బైబిల్
ఓ ఖురాన్ 
ఓ భగవద్గీత 
మన భారత మాత...
దూషించకు  
ద్వేషించకు...

ఒక బలుపు
ఒక గెలుపు
ఒక కావరము
జాతకమంతా
ప్రకోపించకు
ప్రేలాపించకు...

ఒక అల్పసంఖ్య
ఒక వర్గ ముఖ్య
ఒక అనల్ప వ్యాఖ్య
దేశం సహించదు
దైవం క్షమించదు...

ఒక నీచ రాజకీయం
ఒక ఓటు ప్రమేయం
ఒక పక్షపాత నాటకీయం
ప్రభుత దయనీయం
ప్రజలమతిహేయం..!!

No comments:

Post a Comment