ఓ లలనా! నీపై కవితలల్లనా!!-రాఖీ
వాలిన కనురెప్పలు అల్చిప్పలు..!
వాలిన ము౦గురులు..కెంపుల చెంపలతో సరిగమలు..!!
ముక్కున..మెరిసిన పుడకనో ..
నుదుటిన మెరిసిన తిలకమో.
పెదవుల మెరిసిన వర్ణమో..
మోమున మెరిసిన బిడియమో ...
ఏది ఎరుపో ,,
తెలుప కలిగే నాకు మైమరపో..
హాసము..నయనాల్లోనా..
అధరాల్లోనా.. పలువరుసలోనా
సంపూర్ణ వదన సీమలోనా..
నీ రూపలావణ్యం అనన్య సామాన్యం
ఓ లలిత రుచిత లతాంగీ
మానవ రూపు దాల్చిన లలిత సంగీత భంగి...!!


No comments:
Post a Comment