Friday, February 18, 2022

 "వరమే జరా రహిత మరణం"-డా.రాఖీ


తెలుసుకో నేస్తం నువు ముసలివాడివైనావని

మసలుకోనేస్తం నీకు నీవే తోడు నీడవని


ఎప్పుడైతే  నీ కంటె పెద్దలా తోచేవారు

నిన్ను అంకుల్ అని పిలుస్తారో

ఎప్పుడైతే మీ ఇరుగుపొరుగు పిల్లలంతా

 తాతయ్యా అని అరుస్తారో

ఎప్పుడైతే బస్సుల్లో రైళ్ళలో స్త్రీలు

 వాళ్ళ పక్కన కూర్చున్నా పెద్ద తేడాగా ఫీలవరో

నువ్ స్కూటిపై నడిరోడ్డుపై వెళ్ళుతున్నా 

ఇతర వాహనదార్లు నిను విసుక్కోక తప్పుకపోతారో


తెలుసుకో నేస్తం నువు ముసలివాడివైనావని

మసలుకోనేస్తం నీదైన నీదారి చూసుకునేలా


నీ కళ్ళముందటి నీ సంతానం నీకు సుద్దులు బోధిస్తుందో

నీకేం తెలియదు డాడీ అని నిర్ధారణ చేస్తుందో

ఓ మూలన పడి ఉంటే అన్నీ మేంచుసుకొంటామని విసుక్కుంటేనో..


నీ అర్ధాంగి ఎదిగిన పిల్లలంటూ వాళ్ళని వెనకేసుకొస్తుందో

అవసరం ఉన్నాలేకున్నా అభద్రతకు లోనై వాళ్ళ పక్షం వహిస్తుందో

మీ ఆహార వ్యవహారాలకు  రోజూ క్లాస్ పీకుతుందో

మీరు రైటైర్ అయ్యీకాగానే (పెన్షన్ వస్తున్నా కూడ)మీరు ఇంట్లోకూర్చొనే

ఓ గుదిబండగా భావిస్తూ అస్తమానం నిందిస్తుందో


తెలుసుకో నేస్తం నువు ముసలివాడివైనావని

మసలుకోనేస్తం ఏకాంతంగా కొనసాగేలా


రామాకృష్ణా అనుకుంటూ మూలన పడి ఉండటమో

చెప్పాపెట్టక ఏ దేశాలో పట్టి సన్యాసుల్లో కలవడమో

ఎప్పుడు ఈ జీవికి విముక్తి ప్రసాదిస్తావో అని దైవప్రార్థన చేయడమో

మీ కనిపిస్తేనో మీరలా చేస్తేనో


తెలుసుకో నేస్తం నువు ముసలివాడి వైనావని 

మసలుకోనేస్తం నీకొరకే నీమనుగడ సాగాలని