Saturday, December 23, 2017

“స్నేహ స్పూర్తి” 

చెమరించిన నా నయనాలు
చెలియలి కట్టను తెంచుకొనే సాగరకెరటాలు
హృదయ నాడులని రుద్రవీణలా మ్రోయిస్తుంటే
బాధతో మెలికలు తిరగనా...
స్నేహగీతి మాధుర్యంలో మైమరవనా..

నేస్తం...!
అక్కరకు రాకున్నా.. అక్కునచేర్చుకోకున్నా...
స్నేహ పరమార్థం ...పరస్పర స్పూర్తి దాయకం..
ఏల మిత్రలాభం?కాదుగా చెలిమి వ్యాపారం..!

అందమైన విరులను నమిలి మింగము...
కమ్మనైన జిలేబి చెవులకు ధరించము...
రంగుల హరివిల్లుని ఒడిసి పట్టలేం...
మధురమైన గీతాన్ని కుంచెతొ చిత్రించలేం...
అస్వాదన..అనుభూతి..అనుభవం...
దేనికదే ప్రత్యేకం..

నేస్తం...!!
కొన్ని క్షణాలు..విలక్షణాలు..
మన అనుబంధాలు.. 
జన్మాంతర తీరని ఋణాలు...
సాగనీ ఇలాగే జీవితాలు..
కొనసాగనీ కడదాకా ...
మన స్నేహితాలు..!!!

No comments:

Post a Comment