Thursday, December 31, 2009

రమ్యస్మృతి

నిదుర నేను పోదామంటే
ఎప్పుడు నువ్వొస్తావో
మెలకువగా ఉందామంటే
కలనైన కనిపిస్తావో

అశ్రు తర్పణం చేద్దామంటే
కనుల నుండి నువు జారేవో
హృదయ మర్పితం చేద్దామంటే
తెలియకుండ అది నిను చేరేనో
ఏమివ్వగలను నేను
ఏమవ్వగలను నేను
కవితయై నిన్నలరిస్తా
రమ్యస్మృతినై నీలొ నిలుస్తా

3 comments:

  1. కనులు మూసుకో తప్పక కలనై వస్తా
    అశృ తర్పణం చేయనా కలవరపడకు
    నీ మదిలో చిరకాల స్నేహమై నిలుస్తా

    ReplyDelete
  2. swaagataalu naa blog ki..dhanyavaadaalu mee sahrudayataki..
    sadaa
    mee snehaabhilaashi
    raki

    ReplyDelete
  3. నూతన సంవత్సర శుభాకాంక్షలు .

    ReplyDelete