Sunday, December 27, 2009

సాగర సంగమం

శివ ఝటాజూటము వీడి
హిమశిఖర పీఠమును పారాడి
ఉత్తుంగ తరంగయై
ఉన్మత్త అభంగయై
దూకే నీ భావ గంగాలింగమునకై
హరి శయన తల్పమై
సిరి జనకులా అనల్పమై
హిమకర పూర ప్రకల్పమై
అమోఘ సంగమమునకై
నేనైపోతా సహస్ర బాహు కెరట
విశాల సంద్రమై

2 comments:

  1. పద్మార్పిత గారూ! నా సరిక్రొత్త బ్లాగ్ కి సుస్వాగతం!
    ఇలాగే ఎల్లప్పుడూ మీ చక్కని ప్రతిస్పందనలు అహ్వానిస్తూ ..ఆకాంక్షిస్తూ..
    సదా మీ స్నేహాభిలాషి
    రాఖీ

    ReplyDelete