Friday, April 8, 2016

“ఆనందానికి సదా నాంది -ఉగాది ముదమ్మది-”

“ఆనందానికి సదా నాంది -ఉగాది ముదమ్మది-”

షడ్రసనోపేతం భోజనం
రసానుభూతి షట్కం జీవితం

మధురం(తీపి)- శృంగార౦
ఆమ్లం(పులుపు)-అద్భుతం
తువరం(ఒగరు)-హాస్యం
లవణం(ఉప్పు)-భయానకం(&భీభత్సం)
కారం-అరివీరం(&క్రోధం)
తిక్తం(చేదు)-ఖేదం(కరుణ&శాంతం)

అనుభూతుల ఆస్వాదనలో...
అనుభవమేదైనా ఆహ్లాదం
అభిరుచుల సర్దుబాటులో...
వంటకాలేవైనా..రుచికరం

ఉగాది...ఒక మార్గదర్శి
ఉగాది..ఒక వ్యాసమహర్షి

పెరేదైతేనేం                                                               పెద్ద హృదయముండాలి
ఊరేదైతేనేం
ఎండని ఏరుండాలి

దుర్ముఖినీ మలుచుకోలేమా..
సంతసాల జల్లుగా
దుర్ముఖిని తీర్చి దిద్దుకోలేమా
అందాల పొదరిల్లుగా...

బాటల్లో...నాటాలి...
ఔదార్యపు మావిళ్ళని

పెదవుల్లో...పూయించాలి
చిరునవ్వుల మల్లెలని

మాటల్లో...కూయించాలి
మార్ధవాల కోయిలని

చూపుల్లో వర్షించాలి
తెరిపిలేని వెన్నెలని

మనసు చేసే మహేంద్రజాలం..
సుఖదుఃఖాల ఆలవాలం
మర్మమెరిగితే...మహర్జాతకం..
మరిచామా మనుగడ కృతకం...!!

08/04/2016

No comments:

Post a Comment