Tuesday, April 9, 2013

“అస్పష్ట చిత్రం””(విజయ నామ వత్సర ఉగాది కవిత)||





రాఖీ||“అస్పష్ట చిత్రం””

బ్రతుకు చిత్రమే..సరిగాలేదు...
భావావిర్భావమే..స్పష్టంగా లేదు..
ఏ గీత గీసినా రూపు చిక్కడం లేదు-
ఏ రంగు వాడినా నలుపు తప్పడం లేదు

ఆ నాటి ఆనంద నామ సంవత్సరం  నుండి
నిన్నటి హేవళంబి వరకు ఆనందమైతే..లేదు గాని...
దుష్ట నామ సంవత్సరాలన్నిటా భీభత్సమే...!

ఇక విలంబి” నీగురించి ఎలా జబ్బలు చరుచుకొనేది?
సమాఖ్య సఖ్యతగురించి ఎలా నమ్మిక పెంచుకొనేది....?

ఆరు ఋతువుల ఆది పండగ....ఉగాది
వసంతం సంతకెళ్లి౦దేమో..
గ్రీష్మం-శిశిరాలదే పెత్తనం..

తీపి-చేదు,ఉప్పు-పులుపు,వగరు -కారం
పేరుకు షడ్రుచులైనా ..
బ్రతుకంతా తెగ చేదే-వగచేదే...

కోకిలలు సంతాప సూచకంగా..మౌనం వహించాయి..
తెలంగాణా కోరి- బలిదానాల చేసిన బిడ్డలకు దక్కిన తీరు చూసి..

మా ప్రగతికి తిర'కాసు'ల జాగు నీ ఉనికి తెలుపుతుంది విలంబీ..
అయితే మావైపెపుడొస్తావ్..మమల్నెపుడు వరిస్తావ్..?

నీవు జాగృతి కి వ్యతిరేకివి.....
నిమ్మకు నీరెత్తినట్లు...ఉత్సాహం మీద నీరవ మోడే లకుముకివి..

మేము యుద్ధం చేస్తాం..
మేమూ సమరం సాగిస్తాం..
మాపోరు..మా మీదే..
మా గురి మాలోని ఆర్గురి  మీదే..

మాలోనే దాగి ఉన్నారు నిర్భయ కీచకులు..
మాలో ఇంకా మిగిలున్నారు..కరడు గట్టిన కసబ్..లు
జగమంతా మెక్కి గాలికి గగన మెగిరిన చంచల ఘ(గ)నులు గూడ ఉన్నారు..
ఏవేవో ప్రేలి  అసలుకే ఎసరు తెచ్చే చేతకాని నేతలున్నారు...
అధికారమే ఎరగా స్విస్ బ్యాంకులు నింపుకున్న కుతంత్రులున్నారు
బ్యాంకులని సైతం ముంచిన వంచకులున్నారు..
కీలుబోమ్మలె మేలనుకొన్న చందాన..వాక్  దాన మీయగ లేని కింగులున్నారు

ముందు మమల్ని మేం గెలవనీ....
అప్పుడు నిన్నూ గెలిచి తీరుతాం..

పచ్చదనం తెచ్చేందుకు-
తాగిన కషాయాలు చాలు,
కలలో సైతం రూకలు దొరక్క వేసిన కేకలు చాలు
వెన్నులో జలదరించేలా ఆపన్నుల పై మోపిన 
పన్నుల జటిలం చాలు 
కళ్ళు తెరచి నడుస్తాం..
వాడిన కమలం వల్ల అంటిన మలం చాలు..
మేమోడినా..ఆషామాషీగా తెలుపు గెలుపునూ హరిస్తాం..

విజయానికీ వైఫల్యానికీ సరిహద్దులు  చేరిపేస్తాం..
విశ్వజనీనమైన విభేద రహిత ప్రపంచాన్ని రచిస్తాం..!!















No comments:

Post a Comment