"ఋతుసంహిత"
శిశిరానికి
వణికిన తరులకు
దనివారగ కప్పిన
ఆకుల దుప్పటి
ఆమని..!!
గ్రీష్మంలో
కాలిన పుడమికి
లేపనమై కురిసిన
నవనీతం శ్రావణి..!!
వలపులు రేపిన శరశ్చంద్రిక
తమకపు తపనల
తీర్చిన మదన మంత్రం హేమంతం..!!
Subscribe to:
Post Comments (Atom)
నా వచన కవితలు...
No comments:
Post a Comment