Saturday, April 2, 2011

ఈ“ఖర” ఆఖరా?!

ఈ“ఖర” ఆఖరా?!

కోయిలా కూయవేల? రాయిలా మౌనమేల?
ఉగాది రాలేదనా? రాదేలనా!
మామిడమ్మ చివురేయలేదనా, మల్లి చెల్లి పూయలేదనా
చింత కాయకుంటే ఎందుకంత చింత?
మన్మధుడు చెఱకును విల్లుకై ఎత్తుకెళ్లాడనా !
మమకారాలు కరువయ్యాయనా!
నీ పాట జనం మరి’చేద’య్యిందనా!
పర్యావరణముప్పు వల్ల కన్నీటి ఉప్పూ కరువయ్యిందనా!!
ఇది తెలంగాణాకు మరో దగాదనా
ప్రభుతకు దిగాదనా
వికీలీకులు- టుజీ స్కాంలు- నల్లధనాలు-కృష్ణ కమిటీ నయవంచనలు
పెట్రేగిన సెగాదనా
సునామీల అణుధారికతల అతలాకుతలమైన
జపనీయుల దుఃఖగాద మరి చేదనా
కాలాంతానికి ఈ “ఖర” ఆఖర నా


ఏ’దోనీ’ దయవల్లో సచినాడిన ప్రతిభ వల్లో
యువరాజు పటిమ వల్లో జహీర్ బంతి మెరుపులవల్లో
వీరలెవల్లో ఆడిన పరుగుల సెహవాగువల్లో ,
టీమిండియా పట్టుదలవల్లో శత ఏకవింశతి జనభారతి ప్రీతి వల్లో
సిక్సరుచుల తో,బౌండరీలతో ప్రపంచ టీములన్నిటినీ దంచి పచ్చడి చేసి
అందించిన ప్రపంచ క్రికెట్ ’కప్పు’ నీ ముందుంది.
అస్వాదించు ఆనందించు అది అందరికీ పంచు
అదే నీ మనోబలంపెంచు-విజయగానమిక వినిపించు

ఎందుకు నేస్తం?ఈ బేలతనం
పాడవే కోయిలా.. పాడుకో యిలా....
ప్రకృతికే నేస్తంలా..పాటే సమస్తంలా...
--రాఖీ---9849693324

2 comments:

  1. రాఖీ గారికి, ఉగాది పండగ శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. చాలా బాగా రాసారు.............keep it up
    ఉగాది శుభాకాంక్షలు.............

    ReplyDelete