Thursday, February 4, 2010

క్షణమైనా మనం...!

నాకూ తెలుసు ప్రియతమా...
నన్ను గెలిపించడానికే నువ్వోడిపోతావని...
నన్ను దేవుడిగ మార్చేందుకే నీ గుండియ గుడి చేసావని..!!
కనుమఱుగైన గతం గుర్తొస్తే దుఖః భాష్పాలు...
కనులముందు నిలుస్తే ఆనంద భాష్పాలు....
ఎలాగైనా తప్పవు నయనాల గంగా-యమునల ప్రవాహాలు
దృక్కోణాల కందని దృక్పథం మన మధ్య దిక్చక్రం...!
కలిసినట్లనిపించే ఊహా చిత్రం...!!
పరిచయం అనేది అత్యంత అల్పమైన పదం మనబంధం ముందు..
ఈ అనుబంధం జన్మ జన్మాల పొందు ..పసందు...
అయినా మనసు పంచుకొన్న భావాలు మాటలకెలా అందుతాయి..?
ఏ నిఘంటువులలో దొరుకుతాయి?
వ్యక్తీకరించలేని అనుభూతులు పరవశానికే చెందుతాయి..!
అంతరాంతరాల్లో ఒకటైన మనం...
వేరే అనే భావనలో  మనం మనం..!

3 comments:

  1. పద్మార్పిత గారూ!కవితా దర్పిత గారూ!!అసమాన పద కూర్పిత మీరు!
    అనన్య భావ సంకలిత నేర్పిత గారూ మీకు జోహారు!!

    ReplyDelete
  2. మీ స్పందన బాగుందండీ.. పదాలు లయబద్దంగా చాలా సులువుగా పొదివారు. అభినందనలు.

    ReplyDelete