Saturday, January 30, 2010

ఓ స్త్రీ !

ఓ స్త్రీ !
ఓ నారీ, ఓ ఇంతీ,
ఓ ముగ్ధ, ఓ ముదితా ,ఓ మగువా, ఓ మహిళా
ఓ అతివా ,ఓలలనా,ఓ వనితా,ఓతరుణీ
ఓ కలికీ ,ఓ కోమలీ, ఓ పడతి, ఓ సుదతీ
తల్లివో ,చెల్లివో, పాలవెల్లివో, కల్పవల్లివో
అమ్మవో ,పూల కొమ్మవో,అక్కవో తేనె చుక్కవో
ఎందుకమ్మా మమ్మల్ని ఇలా అలరిస్తావు,ఊరిస్తావు ,ఉడికిస్తావు
ఎందుకమ్మా మాకు ప్రాణం పోస్తావు
మమ్ము మాలిమి చేస్తావు
నీ మురిపాలలో ముంచేస్తావు
నీ సహచర్యం లో లాలిస్తావు
నీ అనురాగంతో తడిపేస్తావు
సూరీడు చుట్టూ భూమిలా
మా జీవితమంతా నీ నీడలా మేమిలా
నీ వెంటే ఉంటాము-నీ చుట్టే తిరుగుతూ ఉంటాము
ఎందుకమ్మా మమ్మల్నిలా ప్రభావితం చేస్తావు
ఎందుకమ్మా మమ్మల్ని ప్రలోభ పెడతావు
మాకు జ్ఞానం కలుగ జేస్తావు
మా చేయి పట్టి నడిపిస్తావు
గోరు ముద్దలు కుడిపిస్తావు
ఏదోలా మంత్ర ముగ్ధులను చేస్తావు
ఏదొ మాయలో పడదోస్తావు
మా కింకే ప్రపంచమూ తెలీదు
మాకు మరింకే ధ్యాసా లేదు
కుసుమం చుట్టూ భ్రమరంలా
చంద్రిక కొరకై చకోరం లా
మేముంటే –మైమరచి పోతుంటే
మాలో లోలోఅంతానీవై నిండిపోతావు
మా సత్యాన్వేషణ మా నిత్యాలోచన
అన్నీ నీవై ఉండిపోతావు
పిచ్చివాళ్లను చేసేది నీవే
మెచ్చి మెళ్ళో దండ వేసేది నీవే
ఎందుకమ్మా ఇలా మామది దోస్తావు
ఎందికమ్మా నీ మది దాస్తావు
త్యాగం నీరూపంటారే
అనురాగం నీ తీరంటారే
ఓ స్త్రీ !
ఓ నారీ, ఓ ఇంతీ,
ఓ ముగ్ధ, ఓ ముదితా ,ఓ మగువా, ఓ మహిళా
ఓ అతివా ,ఓలలనా,ఓ వనితా,ఓతరుణీ
ఓ కలికీ ,ఓ కోమలీ, ఓ పడతి, ఓ సుదతీ
తల్లివో ,చెల్లివో, పాలవెల్లివో, కల్పవల్లివో
అమ్మవో ,పూల కొమ్మవో,అక్కవో తేనె చుక్కవో
ఏదేమైనా
నీ తోనే మా జీవితం!
నీకే మేమంకితం !!!

4 comments:

  1. స్త్రీ కి పర్యాయ పదాలన్నిటినీ ఉపయోగించేసినట్టున్నారు....కవిత బావుందండీ ...అందుకేకదా భారతమాత మొదలుకొని కళామతల్లి వరకు అన్నిటికీ స్త్రీని మాతృక గా గౌరవిస్తారు మన దేశంలో ...

    ReplyDelete
  2. స్త్రీ !ఎన్నికోణాల్లో అలరిస్తుందో..ఎన్ని దృక్కోణాల్లో అగుపిస్తుందో..ఎన్ని వైనాలుగా పరిమళిస్తుందో..పలవరించే ప్రయత్నం చేసా..స్ఫురింపజేసే సాహసంచేసా..పాఠకుల ప్రతిస్పందనే ఈ కృతి సఫలీకృతిని ప్రతిఫలింప జేస్తుంది..
    సదా మీ స్నేహాభి లాషి
    రాఖీ

    ReplyDelete
  3. చాలా బాగుందండి.

    ReplyDelete